భగవత్ బంధువులారా| సనాతన ధర్మ వారసులయిన సోదర సోదరీమణులారా| మనకు వేదము పరమ ప్రమాణము, కానీ వేదము మూర్తి పూజను నిరాకరిస్తుంది. వేదము పంచ యజ్ఞములను, అష్టాంగ యోగ సాధనను చేయమని చెబుతుంది, కలి యుగంలో ఆ మార్గము అసాధ్యము. యుగముల పరిస్థితులను పరిగణన లోకి తీసుకున్న మహర్షులు మనకు మహత్తరమైన సాధనలను ప్రసాదించారు. కృత యుగములో మూర్తి పూజ వంద శాతము లేదు , త్రేతాయుగము నుండి మూర్తి పూజ మొదలైనది, క్రమ క్రమముగా కలియుగం వచ్చేసరికి మూర్తి పూజ వింత పోకడలకు గురియైనది, కలి విక్రమ శకం 5000 సంవత్సరములు దాటిన తరువాత అణు మాత్రము దేవత స్వరూపము లేని పదార్ధములు దేవతలుగా కొలువబడుతున్నారు. ప్రాణవాయువు ప్రకృతిలో ఉండవలసిన స్థాయిలో లేకపోవడము, కర్భన వాయువు ప్రబలత్వం కారణంగా ప్రజలకు మతి స్థిమితం ఉండదు. ఇలాంటి పరిస్థితులనుండి ప్రజలను రక్షించడానికి మా పీఠము స్థాపించ బడినది. మా పీఠము లో ప్రతి ఉపాసన నామ మాత్రపు రుసుముతో ప్రజలందరికీ కుల, మత, ప్రాంత, భాషా భేదము లేకుండా కేవలం ONLINE CLASSES ద్వారా మాత్రమే నేర్పబడుతుంది. ( షరతులు వర్తిస్తాయి )
షోడశీ పీఠములోని కార్యక్రమములు అన్నీ సామూహికముగానే జరుగును , అందరూ కలసి
ముక్తకంఠము తో ఉపాసన చేస్తున్నప్పుడు, సాక్షాత్తు దేవి కొలువున్నట్లు భావన కలుగుతుంది.
దేవతల కంటే మనము చాలా అదృష్టవంతులము, దేవతలు ఆశరీరులు, వారు ఎటువంటి కర్మ చేయాలన్నా భూమి మీద మనవులుగా పుట్టవలసినదే, లేనిచో వారికి కర్మ చేసే అధికారం, అవకాశం లేదు. మానవ జన్మ లభించిన తరువాత జీవిత లక్ష్యమైన మోక్షం కోసం ప్రయత్నించనివాడు ఆత్మ హంతకుడు అవుతాడు.
మీరు ఏ సాధన చేయవలెనన్నా అక్షరమాల అభ్యాసము చాలా ముఖ్యము. పైన
click చేయడం ద్వారా అక్షరమాల Photos, అభ్యాస Audio Files Download చేసుకుని
సాధన చేసి WhatsApp లో Audio పంపి మీ సామర్ధ్యము ప్రకటింపవలెను.
ఏ సాధనకు అయినా కావలసిన అర్హతలు
పైన క్లిక్ చేయడం ద్వారా మీకు అర్హతల పుస్తకము open అవుతుంది
దేవాలయ పూజలు కేవలం ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతాయి పీఠములో జరిగే పూజలు వైదికముగా మూలమంత్ర, న్యాసములు, యంత్రములు /యంత్ర పూజలు, తర్పణములు, హోమములు , పురశ్చరణ లతో జరుగుతాయి, ఈ పూజలకు సాధకులు , సభ్యులు మాత్రమే అనుమతించబడతారు. ఎవరైనా ఇష్టమైన వారు పీఠమును సంప్రదించి అవసరమైన విద్య నేర్చుకుని, అభ్యాసము చేసి పాల్గొనవచ్చును.
ఒకే నామము ఎక్కువసార్లు పలికినా అది నామమే అవుతుంది. అదే నామానికి బీజాక్షర సంపుటీకరణం చేస్తే మంత్రం అవుతుంది. సాధారణంగా నామ ఉచ్చా రణకు ఎటువంటి నిబంధనలు ఉండవు, అవి ఈ కలియుగంలో ఎన్నిసార్లు పలికినా లభించే ప్రయోజనం తక్కువ, మంత్రం యొక్క విధి విధానం నేర్చుకుని జపం చేస్తే ఇష్ట ప్రాప్తి, అనిష్ట పరిహారం కలుగుతుంది. పురశ్చరణ తో ఏ విషయాన్ని సంకల్పిస్తే అది లభిస్తుంది. - దేవి పుత్ర రామ్ కుమార్.