నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని | మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే | సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి | దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే | శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ||
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి | మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే ||
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే | విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే ||
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే | సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే ||