Ver : G.L.N:1.0.2
Ver : G.L.N:1.0.2
ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మూలప్రకృత్యై నమః
దేవీ మార్గము నందలి వివిధ అంతర్గత శాఖలు
సర్వజన జననీ జనకులు లక్ష్మీ నారాయణులు,
విశ్వ జననీ జనకులు పార్వతీ పరమేశ్వరులు,
సృష్టి జననీ జనకులు ఆది పరాశక్తి సహిత పరబ్రహ్మ
మా పీఠములో జరుగు కార్యక్రమములు వైష్ణవ, శైవ, శాక్తేయ పద్ధతులలో జరుగును.
శ్రీ లలిత త్రిపురసుందరి పరాభట్టారిక
ఉదయం
గం। । 6.00 లకు శ్రీ లక్ష్మీనారాయణ పూజ
గం। । 6.30 ని । । లకు శ్రీ పార్వతీ పరమేశ్వర పూజ
గం। । 7.00 లకు బాలా త్రిపురసుందరీ పూజ
గం। । 7.30 ని । । లకు వారాహి దేవీ పూజ
గం। । 8.00 లకు రాజశ్యామల దేవీ పూజ
గం। । 8.30 ని । । లకు లలితా త్రిపుర సుందరీ దేవీ పూజ
మధ్యాహ్నం
గం। । 11.30 ని । । లకు చండీ మహాదేవి పూజ
గం। । 12.30 లకు నైవేద్యం ఆరగింపు
సాయంత్రం
గం। । 6.30 ని। । లకు దుర్గా పరదేవత పూజ
గం। । 7.30 ని। । లకు ప్రదోష సమయ పరమశివ పూజ
గం। । 8.30 ఆరగింపు , శయ్యా, భోగము.
ఒక విశ్వము అనగా ఒక సూర్య మండలం, సూర్య మండల ఉపరితలమునుండి సూర్య కవచము (Heliopause) వరకు మధ్యలో ఉన్న ప్రదేశమును ( 123 astronomical units (AU) from the sun, or about 11 billion miles (18 billion km) ( అనగా 1800 కోట్ల కిలో మీటర్లు ) ఒక విశ్వము అంటారు. ఇలాంటి విశ్వములు ఈ సృష్టి లో కోట్ల కొలది ఉన్నవి. ప్రతి విశ్వములోనూ 14 ఊర్ధ్వ లోకములు, 14 అధో లోకములు, ఉంటాయి , ఈ విశ్వం లో ఉండే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు మరొక విశ్వంలో ఉండే దేవతలకు రూప గుణ కర్మలలో వైవిధ్యము ఉంటుంది. - దేవీ భాగవతము .
చైత్ర శుద్ధ పాడ్యమి : శ్రీ లలితా నవరాత్రులు ( పీఠములో జరుగును )
ఆషాఢ శుద్ధ పాడ్యమి : వారాహి నవరాత్రులు ( పీఠములో జరుగును )
ఆశ్వీయుజ శుధ్ద పాడ్యమి : దుర్గా నవరాత్రులు ( పీఠములో జరుగును )
మాఘ శుద్ధ పాడ్యమి : రాజశ్యామలా నవరాత్రులు ( పీఠములో జరుగును )
మాఘ పూర్ణిమ : లలిత దేవి జయంతి ( పీఠములో జరుగును )
మాఘ పూర్ణిమ : శ్రీ లలితా చతుఃషష్టి ఉపచార పూజ ( మహా విశేషము / సామూహికము పీఠము బయట జరుగును )
సతీ సమేత అష్టదిక్పాలక వ్రతం : ( సామూహికము పీఠము బయట జరుగును )
శ్రీ సత్య నారాయణ స్వామి వారి వ్రతకల్పము : ( మహా విశేషం / సామూహికము - పీఠము బయట జరుగును )
త్రినాధ వ్రత కల్పం : ( విశేషం / సామూహికము పీఠము బయట జరుగును )
మహాలక్ష్మి విశేష వ్రత కల్పం : ( పీఠములో జరుగును )
సువాసినీ పూజలు : ( సామూహికము - పీఠము బయట జరుగును )
సతీ సమేత అష్ట భైరవ పూజలు : ( సామూహికము - పీఠము బయట జరుగును )
తిథి నిత్యాది దేవతల పూజలు : ( నెల రోజులు, 16 దేవతలు ఆరోహణ అవరోహణ విధానం తో ) ( పీఠములో జరుగును )
వేదోక్త చండీ నవ ఆవరణ పూజ : ( నిత్యము పీఠములో జరుగును ) ( విశేషము / సామూహికము - పీఠము బయట జరుగును )
శ్రీ చక్ర పూజ : ( నిత్యము పీఠములో జరుగును ) ( సామూహికము పీఠము బయట జరుగును )
దేవీ కల్పము : ( 5 / 9 రోజులు ) ( మహా విశేషము / సామూహికము - పీఠము బయట జరుగును )
దేవీ కళ్యాణములు : ( విశేషము / సామూహికము - పీఠము బయట జరుగును )
మహా ప్రదోష పూజ : ( విశేషము / సామూహికము - పీఠము బయట జరుగును )
మా పీఠములో సామూహిక పూజలు, వ్రతములు, లోక కళ్యాణార్ధ కార్యక్రమములు మాత్రమే నిర్వహించబడును. వ్యక్తిగతమైన సాధనలు మాత్రమే నేర్పబడును.
సమస్యలకు పరిష్కారములు సూచించబడును, చేయబడవు.
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః | సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఖఃభాగ్భవేత్ ||
అందరూ సుఖంగా ఉండాలి , అందరూ ఆరోగ్యంగా ఉండాలి , అందరూ ఉన్నతంగా ఉండాలి , ఎవరూ దుఃఖంలో ఉండకూడదని కోరుకుందాము .
వేదమార్గ ప్రయాణంలో మూర్తి పూజ నిషేధం. లౌకికం లో అనుష్టాన ఆవశ్యకతను
వేదము అధ్యయనం చేసిన మన పూర్వ ఋషులు ఏర్పాటు చేశారు.
కనుక జ్ఞానము తెలుసుకుని జీవనం కొనసాగించండి।
దేవీ మార్గము సర్వో త్కృష్ట మైన దివ్య మార్గము
Online Classes లో చేరండి, శిక్షణ పొందండి, సాధన చేయండి, తరించండి
సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య మోక్ష మార్గములు కరతలామలకములు ,
సనాతన ధర్మం పరమాత్ముని వర ప్రసాదం. పరమాత్ముడు ఆరు ప్రధానమైన లక్షణములతో విరాజిల్లుతూ ఉంటారు 1. సర్వజ్ఞత శక్తి 2. అనాది బోధ 3. స్వతంత్రత 4. నిత్యత్వము 5. సంపూర్ణ శక్తి 6. అనంతతత్వము. ఇవి కాక ప్రధానంగా 64 ఉత్తమ గుణములలో పరిపూర్ణుడు. భారతీయ విజ్ఞానం అనాదియైనది, అనంతమైనది, సుస్పష్టమైనది, సర్వ బుద్ధి జీవులకు ఆచరణ యోగ్యమైనది. సనాతన ధర్మానికి మూల స్తంభమైన ఋషులు నలుగురు, వారు అగ్ని, వాయు , ఆదిత్య, అంగీరస ఋషులు. వీరలకు ప్రతీ సృష్టి ఆది యందు పరమాత్ముడు వేదమును ప్రసాదిస్తూ ఉంటారు. వేద సారాంశం ప్రకారం పరమాత్ముని శక్తి నుండి 25 శాతము మాత్రమే బహిర్గతమై పరాశక్తి ( మహాబల , మహామాయ, చిత్ శక్తి , అనంత, మహామాత, ) గా రూపుదాల్చి మనము చూస్తున్న మాయా మోహితమైన ప్రపంచమును సత్వము, రజస్సు, తమస్సు అనబడే అత్యంత సూక్ష్మకణముల కలయిక తో సృష్టి చేసినది. ఈ సూక్ష్మకణములు విశ్వంలో కనబడే సమస్త జడపదార్ధములకు మూలకణములు. పరాశక్తి ఈ సృష్టి లో స్థాణ గా ఉంటూ 85 శాతము నిగూఢ శక్తి గాను 10 శాతము శూన్యము గాను కేవలం 5 శాతం మాత్రమే మన కంటికి కనబడే ఉపగ్రహ , గ్రహ, తోకచుక్క, నక్షత్ర, పాలపుంత, మొదలుగా గల సమస్త విశ్వమును సృష్టి చేసినది. తరువాత పరాశక్తి పంచకృత్య పరాయణత్వంతో జ్ఞానశక్తి ( మహా సరస్వతి ) సంపద శక్తి ( మహా లక్ష్మీ ) క్రియా శక్తి ( మహా కాళీ/దుర్గ ) మంత్ర శక్తి ( గాయత్రి దేవి ) ప్రేమ శక్తి ( రాధా దేవి ) రూపములలో విరాజిల్లుతూ ఈ సమస్త సృష్టిని అత్యంత ఖచ్చితమైన ప్రకృతి శాసనములతో పరిపాలిస్తూ ఉంటుంది.
శ్వేత వరాహ కల్పము మొదలై ఇప్పటికి 197 కోట్ల 29 లక్షల 44 వేల సంవత్సరములు మరియు కలి విక్రమశకం 5,125 (సామాన్య శకం 2024 నకు ) సంవత్సరములు గడచినవి , ఇంకనూ 4,26,875 సంవత్సరములు మిగలి ఉన్నవి. ఇప్పటికి ఈ శ్వేత వరాహ కల్పంలో 453 కలి యుగములు వెళ్లిపోయాయి 454 వ కలియుగములో ఉన్నాము. కాగా గతించిన 453 కలియుగములలో అనేకానేక శాస్త్రవేత్తలు పుట్టి ఈ విశ్వము గురించి, విశ్వ ప్రయత్నములు చేసీచేసి కాల గర్భములో కలసిపోయారు, ఈ సృష్టి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పరాశక్తి మానవాళికి ఇచ్చిన సందేశం ప్రకారం శమదమాదులు అదుపులో ఉంచుకుని అష్టాంగ యోగ సాధన చేసి తద్వారా పరమాత్ముని చేరుకోవలెను. కానీ కలియుగంలో 92.25 శాతం అధర్మ రూపంలో వ్యాపించి సమస్త జీవరాశిని తన అధీనంలో ఉంచుకున్న కలిపురుషుని యొక్క ప్రభావమునుండి మానవులు తప్పించుకోజాలరు . కనుక పరాశక్తి తల్లి మానవులు కలియుగంలో తరింపచేయబడటానికి ఋషులకు అత్యంత ఉత్తమమైన దీక్షలు, వ్రతములు, ఉపాసనలు, జప, ధ్యాన, హోమ, తపస్సులు ఉపదేశించినది. వారు వీటిని తమ శిష్య పరంపర ద్వారా మానవాళికి అందచేశారు.
మానవ శరీరం 7 వేల కోట్ల కోట్ల కోట్ల కణములతో, 24 తత్వములతో నిర్మాణము చేయబడినది. మానవులలో నాలుగు విధములైన వారు ఉంటారు 1. జ్ఞానము కలవారు, 2. ధర్మపరులు, 3. పామరులు 4. మూర్ఖులు, వీరు ప్రవృత్తి, గుణ, కర్మ రీత్యా బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య, శూదృలుగానూ పరిగణింప బడతారు. జీవులకు మూడు విధములైన శరీరములు కలవు 1. స్థూల, 2. సూక్ష్మ , 3. కారణ శరీరములు, ఇందులో స్థూల శరీరం లోని క్రియలు: రక్త సంచారం, హృదయ స్పందన, జీర్ణ క్రియ, విసర్జనములు జరుగును. సూక్ష్మ శరీరం లో పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ సూక్ష్మ భూతాలు మనస్సు, బుధ్ది లతో 17 తత్వములు ఉంటాయి. కారణ శరీరముతో మానసిక, వాచిక, కాయిక కర్మలను చేసెదరు. మానవులకు ముఖ్యముగా త్రివిధ ధుఃఖములు ( ఆధ్యాత్మిక , ఆధి భౌతిక , ఆధి దైవిక ) కలవు అవి నశించుటయే నిశ్శ్రేయసము. మోక్ష సాధన కలియుగములో అసాధ్యం. కానీ భారతీయ వైజ్ఞానిక ఋషులు సకల ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొనుటకు వివిధ తరుణోపాయములతో మనకు ఉపాసనా విధములు అందచేశారు.
శంకరాచార్యుల వారిచే కైలాసము నుండి పార్వతీ దేవి కరుణా కటాక్షముతో నందీశ్వరుని నుండి గ్రహింపబడి, భారతదేశములో స్థాపింపబడిన శ్రీవిద్యా విధి విధానముతో, ఆవరణ అర్చనా కల్పోక్త ప్రకారం త్రికాల అనుష్టానములు మా పీఠములో జరుగును. సమస్త భారతీయులకు అర్హత కలిగిన వారికి సాధనలు, దీక్షలు, వ్రతములు, ఉపాసనా విధి విధానములు, కుల, మత, ప్రాంత, భాషా భేదములు లేకుండా Online Classes ద్వారా మాత్రమే నేర్పబడును. నిర్ణీత సమయములో మంత్ర దీక్షలు మాత్రము పీఠములో/ పీఠ నిర్దేశిత ప్రాంతములో ఇవ్వబడును.
వేదము సకల విద్యల, సత్య, మహత్గ్రంధము, సనాతన ధర్మము నిత్యమైనది, అనాదియైనది, ఆచరణ యోగ్యమైనది. అణువంతకూడా లోపము లేనిది. " జంతూనాం నర జన్మ దుర్లభం " 84 లక్షల జీవరాసులలో మనకు మనిషి జన్మ లభించింది. ఆలోచన, విచక్షణ, బుద్ధిమత, ఆచరణ యోగ్యమై సిద్ధిప్రద, ఉపయుక్త, సంస్కారయోగ్యత, ముక్తిసాధన యుక్తమైన మరియు కర్మానుష్టానమైన ఉపాధి లభించినందుకు అంబ పరమేశ్వరికి, జగన్మాత, జగదంబకు, ఆదిపరాశక్తికి శతకోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం , మా పీఠాన్ని సంప్రదించండి . నేర్చుకోండి, సాధన చేయండి, తరించండి.
నరుడికి శరీరం లభించిన తరువాత, వేదం నిర్దేశించిన కర్మలు చేయకుండా మరణిస్తే, పాప పుణ్యముల బంధనమై వివిధ సంక్లిష్ట జన్మలు పొందవలసి ఉంటుంది.
గమనిక : మేము చేయునది ఒక బృహత్తరమైన కార్యక్రమము కనుక మీరు
ఏమైనా తప్పులు గమనించి వివరించినచో మేము సరిదిద్దుకోగలవారము.
Photos Curtesy Pinterest, Pexel, Freepik, Pixabay, Pingwing, Bing, Leonardo AI,Video Curtesy : Youtube