వానప్రస్థ ఉపాసనా క్రమణికలు
వానప్రస్థ ఉపాసనా క్రమణికలు
పరాశక్తి వానప్రస్థ విద్యాలయం లో వేదం నుండి గ్రహించబడి , దర్శనకారులైన ఋషులు మానవాళికి అందించిన వానప్రస్థ ఉపాసన నేర్పబడును. కుల, మత , ప్రాంత, భాషా భేదము లేకుండా సనాతనధర్మ వారసులందరికీ నేర్పబడును. , గత జన్మల నుండి ఈ జన్మ వరకు మీరు చేసిన మానసిక , వాచిక, కాయిక ( శారీరక ) కర్మల వలన, పూర్వజన్మల పరంపరానుగతమైన ప్రారబ్ధ పాశముల వలన, ఈ జన్మ మరియు తరువాత జన్మలు నిర్ణయింపబడి ఉంటాయి. కనుక ఉపాసనా క్రమణికల ప్రారంభంలో, వాటియొక్క ప్రాబల్యం తగ్గించడానికి, వైదిక దినచర్య అత్యవసరం కావున, ఆమూలాగ్రంగా వైదిక దినచర్య నేర్పబడుతుంది. తరువాత తరగతులలో వైదిక ప్రాణాయామం, సంధ్యావందనం నేర్చుకోవలెను. తరువాత గణపతి ఉపాసన నేర్పబడుతుంది. ఇక్కడినుండి మీకున్న సకల కర్మల యొక్క చెడు ప్రభావం తగ్గుతూ, పుణ్య ఫలం పెరుగుతూ ఉంటుంది. ఆ తరువాతి తరగతులలో జనన మరణ విజ్ఞానము సంపూర్ణముగా నేర్పబడుతుంది, . మీకు నేర్పిన ఉపాసన కడు శ్రద్ధగా, క్రమశిక్షణతో , ఇష్టపూర్వకముగా, పూర్తి విశ్వాసంతో ఆచరించవలెను. మీరు చేసే సాధన విఫలం అవడానికి అనేక కారణములు కల్పించబడవచ్చు, కావున నిరంతరం అప్రమత్తతతో ఉండవలెను. మీరు సాధనా మార్గములో చేరడానికి మునుపే, మీకున్న సకల సందేహములు నివృత్తి చేసుకోవలెను. మరియు, ఏదేని కారణం చేత, మీరు చేసే ఉపానన ( మీ యొక్క పూర్వ జన్మ ప్రారబ్ధం అనుసరించి ) పరిపూర్ణం కాకపోయినట్లయితే, కనీసం అనాయాస మరణం మరియు సునాయాస జననం, దానితోపాటు మరొక జన్మ, (కనీసం నర జన్మ) పొందే వీలుకోసం, మీరు చేసే సాధనలో అదనంగా ఏమి చేయవలెనో నేర్పబడును. కావున నిర్భయముగా, నియమముగా సాధన చేయండి. నర జన్మ లభించిన తరువాత తల్లి కడుపులో ఎటువంటి బాధలు లేకుండా ఉండే యోగమును, సుఖజఠరశయన యోగం అంటారు. సుఖజఠరశయన యోగం మరియు సాలోక్యాది మోక్ష మార్గములు మీకు రాబోయే ఉన్నత తరగతులలో నేర్పబడును.
వేద విహిత కర్మలను, కలియుగంలో, నిజ జీవితంలో ఆచరించడం బుధజనులకు సైతం బహు కష్టతరము. కావున సామాన్యులకు కూడా, ఎటువంటి శ్రమ లేకుండా, మీ నిత్య ఉపాసనలలో మిళితం చేయబడి, మీ పురుషార్ధమైన నిశ్శ్రేయసమును సుఖముగా పొందే వీలు, మొట్టమొదటి సారిగా, భారతదేశంలో మా పీఠము ద్వారా కల్పించబడినది.
మొదటి తరగతిలో వైదిక దినచర్య అయిన శయ్యాధ్యానం మొదలుకుని రాత్రి పడుకునే వరకు వివిధ వైదిక దినచర్యలు నేర్పబడతాయి. ఈ వైదిక దినచర్య వలన మీకు క్రమశిక్షణ, ఆరోగ్య అభివృద్ధి, సంకల్పబలం, పాప ప్రక్షాళన, తపస్సు చేయటానికి మొదటి అర్హత లభిస్తుంది. వీటికి సంబంధించి pdf documents, video clips ఇవ్వబడును. మరియు జూమ్ మీటింగ్ ID కూడా ఇవ్వబడును. నిర్ణీత సమయంలో సుమారు 4 గంటల పాటు online class లో సాధనలు నేర్పబడును. మరలా మిమ్మల్ని WhatsApp group లో add చేసి మీ సాధనను గమనిస్తూ ఎప్పటికప్పుడు సరిచేయబడును. దీని యొక్క సాధనా నిడివి 41 రోజులపాటు ఉంటుంది, ఆ తరువాత మీరు చేసిన అనుష్టానము గమనించి, మిమ్మల్ని రెండవ తరగతి లోకి ప్రవేశపెట్టబడును.
పూర్తి వివరములు కోరిన వారికి, prospectus ను WhatsApp లో పంపెదము.
మొదటి తరగతిలో ఉత్తీర్ణులు అయినవారికి మాత్రమే రెండవ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. ఈ క్రమణిక లో సూర్య నమస్కారములు, యజ్ఞోపవీత ధారణ, సంధ్యావందనం, అజపాజపము, నేర్పబడును. వీటికి సంబందించి pdf documents, video clips ఇవ్వబడును. మరియు జూమ్ మీటింగ్ ID ఇవ్వబడును, నిర్ణీత సమయంలో సుమారు 4 గంటల పాటు online class లో సాధనలు నేర్పబడును. మరలా మిమ్మల్ని WhatsApp group లో add చేసి మీ సాధనను గమనిస్తూ ఎప్పటికప్పుడు సరిచేయబడును. దీని యొక్క సాధనా నిడివి 41 రోజులపాటు ఉంటుంది, ఆ తరువాత మీరు చేసిన అనుష్టానము గమనించి, మిమ్మల్నిమూడవ తరగతి లోకి ప్రవేశపెట్టబడును.
రెండవ తరగతిలో ఉత్తీర్ణులు అయినవారికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. ఈ క్రమణిక లో గణపతి ఉపాసనా కల్పము నేర్పబడును. ఇందులో భాగంగా, గణపతి విశేషపూజ, గణపతి మంత్ర దీక్ష , గణపతి తర్పణములు, గణపతి యంత్రపూజ, గణపతి హోమము నేర్పబడును.. వీటికి సంబందించి pdf documents, video clips ఇవ్వబడును. ఈ కార్యక్రమము పీఠములో జరుగును. నిర్ణీత సమయంలో సుమారు 6 గంటలు మౌఖికముగా చెప్పబడును మరియు సాధన చేయించబడును. మరలా మిమ్మల్ని క్రొత్త WhatsApp group లో add చేసి, మీ సాధనను గమనిస్తూ సరిచేయబడును. దీని యొక్క నిడివి 41 రోజులపాటు ఉంటుంది, ఆ తరువాత మీరు చేసిన అనుష్టానము గమనించి, మిమ్మల్ని నాలుగవ తరగతి లోకి ప్రవేశపెట్టబడును.
తరువాతి సాధనలు, పై మూడు సాధనలు పూర్తి చేసి, అర్హత పొందిన వారికి మాత్రమే నేర్పబడతాయి .
అర్హత పొందినవారి log in